
భూమిని వెనక్కి తీసుకుంటాం
● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో వరి సాగు మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా నాటు వేశారని, ఈ క్రమంలోనే రైతులు ఎక్కువ మొత్తంలో యూరియా కొని నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు.
● అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులు యూరియా వస్తలేదని ఆందోళన చెందుతున్నారని, వచ్చిన యూరియాను శాసీ్త్రయంగా వాడితే సరిపోతుందని దీనిపై రైతులకు ఆవగాహన కల్పించాలని చెప్పారు.
● నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ యూరియా సరఫరాలో లోడు సమయానికి రావడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే అధికారులు యూరియా సరఫరా నిశితంగా పర్యవేక్షణ చేయాలన్నారు.
● పీయూలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్‌నుపరిశీలించిన వీసీ శ్రీనివాస్
● రెండు, మూడ్రోజుల్లో హద్దురాళ్లుపాతుతామని స్పష్టీకరణ
● డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియాపై అధికారులు పర్యవేక్షించి సక్రమంగా సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు.
● కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వెల్దండ, ఊర్కొండ మండలాలకు యూరియా ఎక్కువ సరఫరా చేయాలని సమావేశం దృష్టికి తెచ్చారు.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు 500 గజాల భూమి కేటాయించడం, ట్రాన్స్‌కో అధికారులు కేటాయించిన దాని కంటే ఎక్కువ భూమిని చదును చేయడంతో వివాదం నెలకొంది. ఈ విషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘పీయూలో సబ్‌స్టేషన్ వివాదం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల నాయకులు పీయూ ముఖద్వారం వద్ద గంటసేపు నిరసన చేపట్టారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే భూములను వెనక్కి తీసుకోవాలని, ట్రాన్స్‌కో అధికారులు కట్టిన ప్రహరీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి విద్యార్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కేటాయించిన భూమి కంటే ఎక్కువ వినియోగించుకుంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు వైస్ చాన్స్‌లర్ నుంచి స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టి అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబు కూడా విద్యార్థి సంఘాల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా వినిపించుకోలేదు. దీంతో వీసీ శ్రీనివాస్ బయటకు వచ్చి విద్యార్థులకు వివరణ ఇచ్చారు. కేటాయించిన భూమికంటే ఎక్కువ భూమిని వారు చదును చేశారని తెలిసిన వెంటనే నోటీసులు ఇచ్చామని, దీనికి వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఎక్కువగా వినియోగించిన భూమిని తిరిగి తీసుకుంటామని, కేటాయించిన భూమి వరకు హద్దులు నిర్ణయిస్తామని వీసీ పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎక్కడి వరకు భూమి కేటాయించారు.. ఎక్కడి వరకు చదును చేశారు.. అని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ఆయా సంఘాల నాయకులు కార్తిక్, రాము, గణేష్, తాయప్ప, రాజేష్, శ్రీను, ఆంజనేయులు, శివ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
● మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి దేవరకద్ర, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి యూరియాను కొనుగోలు చేస్తారని, కాబట్టి ఇక్కడి ఎరువుల దుకాణాలకు ఎక్కువ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

భూమిని వెనక్కి తీసుకుంటాం