
ఉత్సవాలనుఘనంగా నిర్వహిస్తాం
శివరామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా ఎంతో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమాలతో పాటు తొమ్మిదిరోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భజన, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. గణపతి లడ్డూ ప్రసాదాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొన్నేళ్ల నుంచి లక్కిడిప్ నిర్వహిస్తున్నాం. నిమజ్జనం రోజు లక్కిడిప్‌లో గెలుపొందిన విజేతకు సన్మానం చేసి 51 కిలోల లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తాం.
– గోరంట్ల మాల్యాద్రిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు
● ఈసారి శివుడి రూపంలో భారీ గణనాథుడు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని పాతపాలమూరు వినాయక ఉత్సవాలు ప్రత్యేకత చాటుకుంటోంది. జైల్‌ఖానా సమీపంలో శ్రీశివరామాంజనేయ భక్తసమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠిస్తున్న గణేష్ ఉత్సవాలకు 68 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. శివరామాంజనేయస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ ధూల్‌పేటలోని దేశ్‌రాజ్‌సింగ్ కళాకార్ రూపొందించిన శివుడి రూపంలో ఉన్న 27 అడుగుల గణనాథుడిని ఏర్పాటు చేయనున్నారు. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో త్రిశూలం, పులి చర్మం ధరించిన వినాయకుడి రూపం ఉంది.
●
పాతపాలమూరు @ 68 ఏళ్లు