
పడమటి అంజన్న ఉత్సవాల నాటికి కోనేరు ఆధునికీకరణ
మక్తల్: పట్టణంలో శ్రీపడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల నాటికి కోనేరు ఆధునికీకరణ పనులను పూర్తిచేస్తామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పడమటి అంజన్న కోనేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తిరుపతి, యాదగిరిగుట్ట తరహాలో పడమటి అంజన్న కోనేరును తీర్చిదిద్ది భక్తులకు అంటుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అనంతరం ప్రముఖ ఆర్కిటెక్చర్ కల్పన కోనేరు పనులను రిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 కోనేరులను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేష్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, నాగేందర్, ఆంజనేయులు, ఈఓ శ్యాంసుందరాచారి, రవికుమార్, కట్ట సురేశ్, నాగశివ, శ్రీనివాసులు, హేమసుందర్, చంద్రశేఖర్, అరవిందు, డీవీ చారి పాల్గొన్నారు.