
అనుమతి.. అవిఘ్నమస్తు
కల్వకుర్తి టౌన్: పూజల్లో మొదటి పూజలందుకునే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. కాలనీవారంతా ఒక దగ్గరకు చేరి, కోలాటాలు, బతుకమ్మలు, నృత్యాలు, చిన్నారుల కేరింతలు ఇలా పలు రకాల కార్యక్రమాలతో నవరాత్రులను జరుపుకొనేందుకు చిన్న, పెద్ద తేడా లేకుండా సిద్ధమవుతున్నారు. నవరాత్రుల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా, ఇబ్బందులు కలిగించేవి ఉంటే వెంటనే పరిష్కారం చేయడానికి పోలీస్‌శాఖ ప్రత్యేక నజర్ పెట్టింది. దీనికి పోలీస్‌శాఖ ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను తయారు చేసింది. వినాయక మండపాలను ఆన్‌లైన్ నమోదు చేయడంతో నవరాత్రుల ప్రారంభోత్సవం నుంచి శోభాయాత్ర, నిమజ్జనం వరకు తదితర అంశాలను చాలా సులువుగా చేపట్టవచ్చని పోలీస్‌శాఖ భావిస్తోంది. ఇలా పోలీస్‌శాఖ అనుమతులే కాకుండా విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి పొందిన అనుమతుల వివరాలను పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీస్‌శాఖ వారు ఆన్‌లైన్ విధానంపై పలుమార్లు నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు.
●
వినాయక మండపాలకు ఆన్‌లైన్ తప్పనిసరి
వివరాల నమోదుకు పోలీస్‌శాఖ ప్రత్యేక పోర్టల్
నిర్వాహకుడి సమాచారం, మండపం వివరాలు నమోదు
అన్నిశాఖల అధికారుల సమన్వయానికి దోహదం
నాలుగు రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

అనుమతి.. అవిఘ్నమస్తు

అనుమతి.. అవిఘ్నమస్తు

అనుమతి.. అవిఘ్నమస్తు