
జూరాలకు వరద జోరు
ధరూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద పెరుగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. శుక్రవారం 3.55 లక్షల క్యూసెక్కులు ఉండగా.. శనివారం రాత్రి 8.30 ప్రాంతంలో మరింత పెరిగి 4.08 లక్షలకు చేరిందని వివరించారు. ఈ సీజన్‌లో ఇంత పెద్దమొత్తంలో వరద రావడం ఇదే మొదటిసారి అన్నారు. దీంతో ప్రాజెక్టు 44 క్రస్ట్‌గేట్లు పైకెత్తి 4,16,629 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆవిరి రూపంలో 40 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 470 క్యూసెక్కులు వదిలినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.622 టీఎంసీలు ఉందన్నారు.
నిలిచిన విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరద భారీగా చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో శనివారం ఉత్పత్తి నిలిచిపోయినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
ప్రాజెక్టు 44 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు
నీటి విడుదల