
గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని గణేష్‌భవన్‌లో శుక్రవారం గణేష్ ఉత్సవ సమితి, మండపాల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంటిల్లిపాదిని ఈ ఉత్సవాల్లో భాగం చేయాలని కోరారు. మహిళల చేత లలిత సహస్రనామ పారాయణం, చిన్నారుల చేత హనుమాన్ చాలీసా పఠనం, రామాయణ, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు చేయాలన్నారు. హైందవ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు జరపాలన్నారు. కాలనీల్లో ఉండే చిన్నారులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగం చేస్తూ భగవద్గీత, రామాయణం శ్లోకాల పోటీలు నిర్వహించాలని అన్నారు. నిమజ్జనం రోజు వీలైనంత త్వరగా గడియారం చౌరస్తా వద్దకు ఊరేగింపుగా రావాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు మనోహర్, ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు యాదిరెడ్డి, బాలయ్య, లక్ష్మణ్, విఘ్నేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే అంతర్జాతీయ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేక్‌కట్ చేసి కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.