
మైనర్ డ్రైవింగ్ కట్టడికి చర్యలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో మైనర్ డ్రైవింగ్ సమస్యలను అరికట్టడానికి తల్లిదండ్రులకు విస్తతంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం భరోసా, షీటీం, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి మైనర్ డ్రైవింగ్ తగ్గించాలన్నారు. విద్యార్థినులు, అమ్మాయిల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గృహహింస, మహిళలపై దాడులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో సీఐడీ ఎస్పీ అన్యోన్య, ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు లక్ష్మణ్, శ్రీనివాసులు, ఎస్‌ఐ సుజాత పాల్గొన్నారు.