
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని బీచుపల్లి పుణ్య క్షేత్రం కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సీతారాములను అందంగా ముస్తాబు చేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణం జరిపించారు. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు సంగాలకు చెందిన నల్లారెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.