
ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
గట్టు: మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన పల్లె య్య, చిట్టెమ్మ దంపతుల మూడో కుమార్తె సంజు(5) మృతికి కారణమైన ఆలూరులో ఆర్‌ఎంపీ నర్సింహ నిర్వహిస్తున్న క్లినిక్‌ను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రసూనరాణి, డాక్టర్ కిరణ్మయి, మెడికల్ అధికారులు బుధవారం ఆలూరులో పర్యటించి క్లినిక్‌ను తనిఖీ చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు.. ఆలూరులో ఆర్‌ఎంపీగా నర్సింహ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తుమ్మలచెరువుకు చెందిన బాలిక సంజు (5)కు తట్టు పోయడంతో పాటు జ్వరం రాగా, రెండు రోజుల క్రితం బాలికను క్లినిక్ తీసుకెళ్లారు. నర్సింహ హైపవర్ కలిగిన ఇంజక్షన్ ఇవ్వడంతో బాలిక పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే బాలికను కు టుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్క డే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామంలో పంచాయతీ నిర్వహించిన అనంతరం బా లిక అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. బాలికల తల్లిదండ్రులకు కొంత మేరకు నష్టపరిహారం ఇచ్చేలా పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన కలెక్టర్ బీఎం సంతోష్ దృష్టికి రాగా, ఆయన ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆలూరు చేరుకుని విచారణ చేపట్టి క్లిని క్‌ను సీజ్ చేశారు. ఆర్‌ఎంపీ నర్సింహపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
కేటీదొడ్డి: విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో గుడిసె దగ్ధమైన ఘటన మండలంలోని ఎర్సన్‌దొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో జంబయ్యకు చెందిన గుడిసె షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు పేర్కొన్నారు.