
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ అని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే, ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత రాజీవ్‌గాంధీ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, చంద్రకుమార్‌గౌడ్, సీజే బెనహర్, సిరాజ్‌ఖాద్రీ, జహీర్ అఖ్తర్, వసంత, సాయిబాబా, అజ్మత్‌అలీ, రాములుయాదవ్, పీర్ సాధిక్, అవేజ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.