
అత్యవసరసమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్‌పురాలోని ఆర్‌యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్‌ను ఇవతల ఉంచి న్యూటౌన్‌లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్,
ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా
వానొస్తే.. రాకపోకలు బంద్
వాన ఒచ్చిందంటే తమ ఊరుకు రాకపోకలు బంద్ అవుతాయి. జడ్చర్ల–ఆలూరు మధ్య రైల్వే ఆర్‌యూబీ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో బైక్‌లు, ఆటోలు వెళ్లేందుకు వీలు పడదు. దీంతో జడ్చర్ల నుంచి బూర్గుపల్లి గ్రామం మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రైల్వే అధికారులు స్పందించి ఆర్‌యూబీ వద్ద వరద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి.
– కృష్ణ, ఆటో డ్రైవర్, ఆలూరు
ప్రణాళిక లోపంతో..
మా గ్రామంలో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణం ప్రణాళిక లేకుండా చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అండర్‌బ్రిడ్జిలో మొత్తం వర్షపు నీటితో నిండిపోయి.. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయంపై గ్రామస్తులందరం కలిసి ఆందోళన చేసినప్పటికీ ప్రయోజనం లేదు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుంది.
– కృష్ణ, డోకూర్, దేవరకద్ర
●

అత్యవసరసమయాల్లో ఇబ్బందులు

అత్యవసరసమయాల్లో ఇబ్బందులు