
జాతిపితకు అవమానం
కల్వకుర్తి టౌన్: జాతిపిత మహాత్మా గాంధీకి ఘోర అవమానం జరిగింది. మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం పట్టణంలోని చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు కాళ్ల నుంచి ధ్వంసం చేసి పక్కనే పడేశారు. ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
విగ్రహం ధ్వంసం చేసిన
గుర్తు తెలియని వ్యక్తులు