
జూరాలకు 95వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 95వేల క్యూసెక్కులకు వరద వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 6 క్రస్టు గేట్లను ఎత్తి 41,112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 38,879 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 80,374 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎగువలో 6 యూనిట్ల ద్వారా 230.683 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 273.706 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఏఈ శ్రీధర్ తెలిపారు.
సుంకేసులకు 32 వేల క్యూసెక్కులు
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 7 గేట్లను తెరిచి 30,653 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. అలాగే కేసీ కెనాల్‌కు 2,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ఎత్తివేత
ప్రాజెక్టు నుంచి 80,374 క్యూసెక్కుల నీరు దిగువకు..