
పాలమూరులోభారీ వర్షం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి 9.30 నుంచి పది గంటల వరకు భారీ వర్షం కురిసింది. నగరంలోని డ్రెయినేజీలు నిండి పొంగి పొర్లడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాలీబాల్
జిల్లా జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో అండర్–15 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు.జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి సుమారు 150 విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ చూపిన 20 మంది ఈ నెల 18, 19న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి ఆర్.శారదాబాయి, మాజీ కార్యదర్శి కె.రమేష్ బాబు, సీనియర్ పీఈటీలు నిరంజన్‌రావు, శైలజ, శ్రీనివాసులు, రాంచందర్, ఖాజామైనొద్దీన్ పాల్గొన్నారు.