
ఫిర్యాదులు వస్తే..
జిల్లాకేంద్రంలో ప్రైవేటు హాస్టల్స్‌కు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిపై నిఘా పెడతాం. ట్రేడ్ లైసెన్స్‌తోపాటు హాస్టల్స్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిని పరిశీలిస్తాం.
– ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్
భద్రతా లోపం ఉంది..
జిల్లాకేంద్రంలోని అనేక ప్రైవేటు హాస్టళ్లలో భద్రతా పరమైన లోపాలు చాలా ఉన్నాయి. బాలికలు అర్ధరాత్రి వరకు బయటికి వెళ్లి తిరిగి వచ్చినా హాస్టల్స్‌కు అనుమతిస్తున్నారు. చాలా చోట్ల ఫీజులు కట్టిన నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. అలాగే కొన్ని రోజులున్నా నెల మొత్తం ఫీజు కట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీటిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– భరత్, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ
●

ఫిర్యాదులు వస్తే..