
రైతు సమస్యల పరిష్కారానికి పోరాటం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అలాగే మహాసభల్లో రైతాంగం కోసం చేసిన పోరాటాలను సమీక్షించుకొని నూతన కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. మొదటి రోజు మహాసభలకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్ మాస్‌లైన్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, అధ్యక్ష, కార్యదర్శులు రంగయ్య, ప్రభాకర్ హాజరవుతారన్నారు. మొదటి రోజు మెట్టుగడ్డ ఐటిఐ కాలేజీ నుండి బాయ్స్ కాలేజీ గ్రౌండ్ వరకు ప్రధర్శన ఉంటుందని, అన ంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. రెండోరోజు నిర్వహించే ప్రతినిధుల సభకు హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, టీయూసీఐ నాయకులు వెంకటేశ్, అరుణ్‌కుమార్, సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.