
రక్షానుబంధం
ప్రేమానుబంధాలను చాటుతున్న రాఖీ పండుగ
● ఆధునిక కాలంలోనూ తగ్గని ఆదరణ
● కొరియర్ల ద్వారా తమ వారికి రాఖీలు పంపిస్తూ సంబరం
● సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షల వెల్లువ
● నేడు రక్షాబంధన్ వేడుకలు
జిల్లాకేంద్రానికి చెందిన చిట్టెమ్మ 1997లో మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా నియామకమైంది. తనకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగను తోటి కండక్టర్లు, డ్రైవర్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే ఏడాది నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించింది. డిపోలోని దాదాపు 220 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి కులమతాలకతీతంగా రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుతోంది. రాఖీపండుగ వచ్చిందంటే డిపోలోని అందరూ చిట్టెమ్మ కట్టే రాఖీ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రాఖీలు కడతానని, రిటైర్డ్ అయ్యే వరకు రాఖీ పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా డిపోలోని ఉద్యోగులందరికి రాఖీలు కడతానని పేర్కొన్నారు.
28 ఏళ్ల నుంచి..