ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

Apr 29 2025 12:14 AM | Updated on Apr 29 2025 12:14 AM

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 86 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి.. సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎరుకలకు ప్రాధాన్యత ఇవ్వాలి..

రాజీవ్‌ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న ఎరుకల కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ఏకలవ్య సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రాగిరి నర్సింహులు డిమాండ్‌ చేశారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌తోపాటు నగర పాలక సంస్థ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌ మండలాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న నిరుపేద ఎరుకల యువకులు, మహిళలకు రాజీవ్‌ యువ వికాసం పథకం యూనిట్లు మంజూరు చేయాలని కోరారు.

ప్రజావాణికి 86 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement