ప్రజల అవసరాలకు తగట్టుగా బడ్జెట్ ఉంది. పట్టణాభివృద్ధి కోసం రూ.4 వేల కోట్లు పెట్టగా.. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు అత్యధిక నిధులు వచ్చే అవకాశం ఉంది. యువ వికాసం ప్రతి నియోజకవర్గంలో 4 వేల మంది యువతకు అమలవుతుంది. ఇరిగేషన్ కింద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బడ్జెట్ కేటాయింపులు జరుగుతుంది. నీటి పారుదల, విద్య, వైద్యరంగాలకు మంచి బడ్జెట్ ఇది.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్
ఆరు గ్యారంటీలను గాలికివదిలేశారు
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు గాలికి వదిలేసిన విధంగా కొత్త బడ్జెట్ ఉంది. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసే, ఉదండాపూర్ నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశం పాలకులు లేనట్లుంది. పాలమూరు యూనివర్సిటీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశమే కనిపించడం లేదు.
– ఎ.రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి
అవసరాలకు తగట్టు బడ్జెట్