మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దేశం కోసం, సమాజం కోసం యువత పాటుపడాలని పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ సూచించారు. పీయూలో మంగళవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్–25ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగడానికి యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి వారితోనే సాధ్యమన్నారు. కాగా, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ ఆచార్య డా.చెన్నప్ప, జిల్లా యువజన అధికారి వి.కోటానాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్
యువ ఉత్సవ్–25 ప్రారంభం