అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు తేవడంపైనే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా. ఉన్నత విద్యపై దృష్టిపెడతాం. ఈ ప్రాంతంలో 3.50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే మంజూరైన అమ్రాబాద్ లిఫ్టుల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతాను. సీఎం సహకారంతో నల్లమల ప్రాంతాన్ని మరో కోనసీమగా మార్చడమే నా లక్ష్యం. నల్లమలలోని వనరుల ద్వారా ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై గళం వినిపిస్తాను.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట


