పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. విషాద ఘటన! | - | Sakshi
Sakshi News home page

పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. విషాద ఘటన!

Dec 28 2023 12:48 AM | Updated on Dec 28 2023 12:01 PM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: రైలు పట్టాల పైనుంచి ద్విచక్రవాహనం దాటిస్తుండగా.. అకస్మాతుగా రైలు రావడంతో బైక్‌ పూర్తిగా ధ్వంసమై దంపతులు ప్రాణాలతో బయటపడిన సంఘటన బుధవారం డోకూర్‌ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరూర్‌కి చెందిన అశోక్‌ తన భార్యకు వైద్యం నిమిత్తం డోకూర్‌కు వచ్చాడు. గ్రామంలో ఉన్న రైల్వే గేట్‌ వద్ద వారం రోజుల కిందట రైల్వే అధికారులు అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టి ప్రయాణికుల రాకపోకలకు ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు చేశారు.

ఈ విషయం తెలియకపోవడంతో గతంలో ఉన్న మార్గంలో వచ్చిన అశోక్‌ తన ద్విచక్రవాహనాన్ని (అండర్‌పాస్‌ నిర్మాణం పక్క నుంచి) పట్టాల పైనుంచి దాటిస్తున్న క్రమంలో అకస్మాతుగా రైలు వచ్చింది. దీంతో పట్టాలపై బైక్‌ను వదిలేసి పక్కకు తప్పుకొన్నాడు. ఈ సంఘటనలో బైక్‌ పూర్తిగా ధ్వంసం కాగా.. దంపతులు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. బైక్‌ రైలు ముందు భాగంలో చిక్కుకపోవడంతో లోకోపైలెట్‌ రైలును నిలిపివేశాడు. స్థానిక సిబ్బంది సాయంతో రైలు కింద చిక్కుకున్న బైక్‌ను తొలగించిన అనంతరం రైలు ముందుకు కదిలింది. ఈ సంఘటనతో రైలు దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఇవి చదవండి: వివాహిత మృతి! భర్తే వేధించి, పురుగుల మందు తాగించాడని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement