సమ సమాజాన్ని నిర్మిద్దాం

చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు   - Sakshi

ఉచిత విద్య, వైద్యంతోపాటు..

మహిళల రక్షణకు ప్రాధాన్యం

మద్యపాన నిషేధం,అవినీతిని పారద్రోలాలి

భిన్నాభిప్రాయాలువెల్లడించిన విద్యార్థులు

పలువురికి బహుమతుల ప్రదానం

వారు ఓటు వేయకూడదు

వాహనదారులు, పవిత్ర స్థలాలకు వెళ్లేవారు మద్యం తాగి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ, ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లేవారు మద్యం తాగి వెళ్తే ఓటు వేసేందుకు నిరాకరించాలి. నేనే ఎమ్మెల్యే అయితే డబ్బులు, మద్యం పంచకుండా అవినీతిని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటా.

– సాయివెంకట వరప్రసాద్‌

అన్ని వసతులు కల్పిస్తా..

ప్పటికీ చాలా గ్రామాల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను ఎమ్మెల్యే అయితే ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అవసరమయ్యే రోడ్లు, తాగునీరు, పాఠశాలలు నిర్మించి పేదలకు అందుబాటులో ఉంచుతా. ఆస్పత్రులను సైతం నిర్మించి మంచి వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటా.

– జి.శ్రుతి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: వివక్ష లేని సమ సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేను ఎమ్మెల్యే అయితే’ చర్చా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా ఉండే సమాజ నిర్మాణం అవసరం ఉందన్నారు. ఉచిత విద్య, వైద్యం అందించడం, మహిళల రక్షణకు ప్రాధాన్యం, బాల్య వివాహాలు, పేదరిక నిర్మూలన, ఉపాధి వంటి అంశాలపై ని ర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొని న్యాయం చే స్తామని పేర్కొన్నారు. మద్యం నిషేధానికి, రైతులకు మేలు చేసేలా చూడాలని కోరారు. ఈ క్రమంలో ఉత్తమంగా అభిప్రాయాలు వెల్ల డించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

సాక్షి ఆధ్వర్యంలో ‘నేను ఎమ్మెల్యే అయితే’ చర్చా కార్యక్రమం

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top