కొల్లాపూర్: ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు చేపట్టాలని కోరుతూ భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి కొల్లాపూర్ మండలం ఎల్లూరుకు చెందిన బండి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. శుక్రవారం ఆ లేఖను పోస్టు ద్వారా పంపించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే వారికి కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, డీసీసీబీ అధ్యక్ష ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానం ఎత్తివేయాలని లేఖలో కోరారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా రెండు పర్యాయాలు గెలిచిన వ్యక్తులకే ఎమ్మెల్యే, ఎంపీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ సౌకర్యాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.
సీఈసీకి కొల్లాపూర్ వాసి లేఖ