
ఇటీవల ఫంక్షన్స్, డీజేల వద్ద డ్యాన్సులు చేస్తూ యువకులు గుండెపోటుతో చనిపోవడానికి కారణాలు ఉన్నాయి. అలాంటి వారు పూర్తిగా ఆరోగ్యంగా లేకపోవడం, సరైన సమయంలో ఆరోగ్య పరిస్థితి చూసుకోరు. ధూమపానం, మద్యం, మానసిక ఒత్తిడి పెరిగి జబ్బు పెరుగుతుంది. మా దగ్గరకు వస్తున్న వారిలో చాలా మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాం. 6నుంచి 7గంటల నిద్ర, రోజు గంట వ్యాయామం, సరైన ఆహారం, రోజుకు 3–4లీటర్ల నీరుతాగడం, ప్రశాంతమైన జీవనం సాగించడం చేయాలి.
– మహేష్‌బాబు,
గుండె వైద్యునిపుణుడు, మహబూబ్‌నగర్
చిన్న వయస్సు వారే అధికం..
గుండెకు సంబంధించి గుండెపోటు ఒకటే సమస్య కాదు. లయబద్ధంగా కొట్టుకోకపోవడం, చిన్న వయస్సులో జనటిక్ సమస్యలతో గుండె బలహీనత పడటం అవుతుంది. కరోనా తర్వాత చిన్న వయస్సు కలిగిన వారిలో దాంట్లో పురుషులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. క్రమం తప్పకుండా హార్ట్‌బీటింగ్, కొలాస్ట్రాల్, బీపీ, షుగర్ చూసుకోవాలి. జిల్లాలో కోవిడ్ వైరస్ వల్ల ఽ50నుంచి 60శాతం గుండె నొప్పి సమస్యలు పెరిగాయి. అధిక ఆయాసం, గుండెనొప్పి ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర చికిత్స తీసుకోవాలి. ఉద్యోగులు పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి వ్యాయామం లేకుండా నిద్రపోవడం. ఈ క్రమంలో తెలియకుండానే కొవ్వు పెరిగి దానివల్ల రక్తంలో బ్లాక్స్ ఏర్పాటు అవుతాయి. రక్త నాళాలపై కొవ్వు పెరుకుపోవడం వల్ల గుండె, మెదడు స్ట్రోక్ వస్తోంది. ఇలాంటి ఇన్సులెన్ తగ్గిపోయి డయాబెటిక్‌కు దారితీయడంతో పాటు శరీరం అధికంగా బరువు పెరుగుతుంది. 45నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోరాదు. మాంసం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.
– స్వరూప్,
జనరల్ ఫిజిషియన్, మహబూబ్‌నగర్
