● జిల్లాకు చేరుకున్న ప్రశ్నపత్రాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వచ్చేనెల 4 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున.. ముందస్తుగానే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని డీఈఓ యాదయ్య పేర్కొన్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఎస్సెస్సీకి పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాలు జిల్లాకేంద్రంలోని మోడల్ బేసిక్ పాఠశాలకు చేరుకున్నాయి. అక్కడి నుంచి రెండు మూడు రోజుల్లో వివిధ పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు చేరవేస్తారు.
పంటల పరిశీలన
మిడ్జిల్: మండలంలోని వెలుగొమ్ములలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖాధికారి వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రైతులు రాబోయే వానాకాలంలో పత్తి విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర కొనుగోలు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సిద్ధార్థ, విస్తరణాధికారి అస్రా ఫాతిమా తదితరులున్నారు.


