ఆశవర్కర్లకు రూ.18వేల వేతనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఆశవర్కర్లకు రూ.18వేల వేతనం అందించాలి

Nov 17 2026 1:20 AM | Updated on Nov 17 2026 1:20 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: ఆశవర్కర్లకు నెలకు రూ.18వేల వేతనం అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఆశవర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెట రాజమౌళి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 28వేల మంది ఆశవర్కర్లు గర్భిణులకు, ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ఆశవర్కర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు సబ్‌సెంటర్‌ డ్యూటీలు, ఏఎంసీ, సీఎంపీ, సర్వేలు చేడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆశవర్కర్లకు రూ.18వేల వేతనం ఇవ్వాలని, లేనిపక్షంలో డిసెంబర్‌ 15న సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వెలుగు శ్రావణ్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరికుంట్ల నాగన్న, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి మంద శంకర్‌, నాయకులు సుజాత, సుజిత, రేణుక, రమాదేవి, రజిని, సరిత, ఉపేంద్ర, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement