● ఎంపీ పోరిక బలరాంనాయక్
మహబూబాబాద్ అర్బన్: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఆఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం నూతన పింఛన్ల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ హాజరై మాట్లాడారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తుందన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలో 1,220మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందంచామని, 36వార్డుల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అనంతరం ఏబీ ఫంక్షన్‌హాల్‌లో మానుకోట మండల లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కమిషనర్ వినోద్, వార్డు కౌన్సిలర్లు భాస్కర్, అజయ్‌సారథిరెడ్డి, రవినాయక్, రాజు, నరేష్, శ్రీదేవి, సరిత,అరుణ, శివ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జిన్నారెడ్డి పద్మ, నాయకులు అంజయ్య, ఖలీల్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


