రబీ సాగు ప్రణాళిక రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

రబీ సాగు ప్రణాళిక రూపొందించాలి

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

● వీసీలో సీఎస్‌ సంజయ్‌జాజు

మహబూబాబాద్‌: నీటి లభ్యతకు అనుగుణంగా రబీ సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ సంజయ్‌జాజు వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా సంజయ్‌ జాజు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 90శాతానికి పెంచాలని ఆదేశించారు. సాగు నీటి ప్రాజెక్ట్‌ల భూసేకరణ, విద్యా, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, డీఆర్వో నాగలక్ష్మి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement