● డీఎల్ఎస్ఏ సెక్రటరీ స్వాతి మురారి
మహబూబాబాద్ రూరల్ : ఆర్థిక స్థోమతలేక న్యాయవాదిని పెట్టుకోలేని నిరుపేదలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి కోసం ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి అనారు. మానుకోట సబ్ జైలును ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలకు న్యాయపరమైన భరోసానివ్వడంతో పాటు, అక్కడి ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వారి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విచారణలో ఉన్న రిమాండ్ ఖైదీలకు ఊరటనిస్తూ న్యాయవాదిని పెట్టుకోలేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు.


