కేయూలో అధునాతన రోబో ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

కేయూలో అధునాతన రోబో ప్రదర్శన

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో రూసా 2.0 పరిశోధనా ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన అధునాతన డింగో మొబైల్‌ రోబోను యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ప్రదర్శించారు. లిడార్‌ డిప్త్‌ కెమెరా సాంకేతికతతో పనిచేసే ఈ రోబో.. ఇండోర్‌ పరిసరాల్లో స్వయంచాలకంగా ప్రయాణించడంతో పాటు నిర్దేశించిన వ్యక్తిని అనుసరించే సామర్థాన్ని ప్రదర్శించింది. రూసా కేయూ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ మల్లికార్జున్‌రెడ్డి, సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రమణ, జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిక్షాలు మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్‌ పున్నంచందర్‌, పరిశోధన ఫెల్లోగా మునీందర్‌ వ్యవహరిస్తున్నారు. రోబో పనితీరును ఎడ్యూటెక్‌ సంస్థ సీనియర్‌ ఇంజనీర్‌ మురగన్‌, ప్రకాశ్‌ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement