వేయిస్తంభాల దేవాలయంలో నాగులచవితి | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల దేవాలయంలో నాగులచవితి

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

హన్మకొండ కల్చరల్‌: శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాగులచవితి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మూలగణపతికి నవరాసాభిషేకం, ఆరాధన, రుద్రేశ్వరునికి రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకం నిర్వహించారు. నాట్యమండపంలో శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పుష్పార్చన చేశారు. వందలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఆవరణలోని నాగేంద్రస్వామి శిలలు, పుట్టకు పాలు, నైవేధ్యాలు సమర్పించి పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సాయంత్రం కార్తీకదీపాలు వెలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement