రోడ్డు ప్రమాదంలో దుప్పి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దుప్పి మృతి

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం దామరవంచ బస్టాండ్‌ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఓ చుక్కల దుప్పి మృతిచెందినట్లు ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు తెలిపా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దామరవంచ అటవీ ప్రాంతం నుంచి ఓ చుక్కల దుప్పి శుక్రవారం మధ్యాహ్నం 365 జాతీయ రహదారి దాటుతుంది. ఆ సమయంలో అటుగా వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనదారుడు దుప్పిని ఢీకొట్టి పడిపోయాడు. ఈ ప్రమాదంలో దుప్పి అక్కడిక్కడే మృతిచెందగా.. వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కాసేపటికి అదేదారితో వచ్చినవారు గుర్తించి 108 అంబు లెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని చుక్కల దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు.

మహబూబాబాద్‌ జిల్లాలో శిశు విక్రయం?

విచారణ చేస్తున్న అధికారులు

మహబూబాబాద్‌ రూరల్‌ : నాలుగు నెలల మగశిశువు విక్రయం జరిగిందన్న ప్రచారం మేరకు చైల్డ్‌ వెల్ఫేర్‌ విభాగం అధికారులు విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మహబూబాబాద్‌ మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తండా కు చెందిన ఓ మహిళ జూలై 12న మహబూ బాబాద్‌ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిరోజుల తరువాత ఆ బాబు చనిపోయాడంటూ తల్లి దండ్రులు ప్రచారం చేసినట్లు, తాము వేరే జిల్లాలో ఉంటున్నామని అధికారులకు తప్పు డు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నా యి. డబ్బుల కోసం శిశువు విక్రయించి ఉంటా రని అనుమానం వ్యక్తం చేస్తూ తండావాసులు చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు శుక్రవారం తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆ బాబు ఎక్కడ ఉన్నాడు.. ఎవరి సంరక్షణలో ఉన్నాడనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ శిరీషను వివరణ కోరగా శిశువు విక్రయంపై సమాచారం రాగా విచారణ చేస్తున్నామని, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, ఆధారాలు లభ్యమయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement