జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలి

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

కమలాపూర్‌: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆర్సీఓ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కమలాపూర్‌ ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 11 నుంచి ప్రారంభమైన వరంగల్‌ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌–17 బాలికల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితోఅన్ని రంగాల్లో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అండర్‌–17 బాలికల క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నెక్కొండ పాఠశాల ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. వ్యక్తిగత విభాగంలోనూ నెక్కొండ పాఠశాలకు చెందిన అమ్ములు ఛాంపియన్‌గా నిలిచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వై.మనోహర్‌రెడ్డి వ్యవహరించగా.. సర్పంచులు బండి వనజ, పబ్బు సతీశ్‌, ఎంపీడీఓ గుండె బాబు, బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవీందర్‌, సీనియర్‌ న్యాయవాది బండి కళాధర్‌, వివిధ ఎంజేపీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్సీఓ శ్రవణ్‌కుమార్‌

కమలాపూర్‌లో ముగిసిన

అండర్‌–17 బాలికల క్రీడలు

ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచిన నెక్కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement