ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రత్యేక అవసరాల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే విజయం సాధిస్తారని జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ మందుల శ్రీరాములు అన్నారు. జిల్లా విద్యాశాఖ సీఎంఓ వంగ సురేష్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌లో ప్రత్యేక అవసరాల పిల్లలకు జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల శ్రీరాములు హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్య, వైద్య, పునరావాస సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆరుద్ర వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్‌ గణేష్‌, హైస్కూల్‌ హెచ్‌ఎం సిరినాయక్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా అసిస్టెంట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, బాస్కెట్‌బాల్‌ కోచ్‌ వెలిశాల కుమారస్వామి, ఫిజికల్‌ డైరెక్టర్లు పిల్లి కాశీనాథ్‌, కమల్‌ కిషోర్‌, జక్కి నాగేశ్వరరావు, రాగం వీరభద్రం, డోలి అరుణ, జిజుల రాజకుమారి, సింధువర్మ, దాక్షినాయక్‌, ఐఆర్పీలు ప్రభాకర్‌, సతీష్‌, కపిల్‌, వీరయ్య, జమున, వీరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement