ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

లాలాపేట: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌, వరంగల్‌, జనగామ జిల్లాల ఉద్యమకారులు గురువారం తార్నాకలోని గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. 1969, 2009 ఉద్యమకారులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, హైకోర్టు ఆదేశించి ఎనిమిది నెలలైనా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే కమిటీ సభ్యులందరి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించి, శోభన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఓయూ పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. దీనిపై స్పందించిన శోభన్‌రెడ్డి, ఉద్యమకారుల దరఖాస్తుల స్వీకరణకు వెబ్‌సైట్‌ సిద్ధమైందని తెలిపారు. డిసెంబర్‌ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆవేశపూరిత చర్యలకు పాల్పడొద్దని కోరారు.

22న హనుమకొండలో

కేటీఆర్‌ సభ

హన్మకొండ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌ తిరుపతి రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతు న్న సందర్భంగా ఈ నెల 22న హనుమకొండ కేడీసీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ విజ య వంతంపై హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్వగృహంలో పా ర్టీ ముఖ్య నాయకుల సమీక్ష నిర్వహించారు. ఈ స మావేశంలో కేటీఆర్‌ సభ విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉ మ్మడి వరంగల్‌ జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు ఈ సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ తాటికొండ రాజ య్య, చల్ల ధర్మా రెడ్డి, నన్నపునేని నరేందర్‌, ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

తునికి పండ్లు తెంపుతూ

మృత్యుఒడికి..

నల్లబెల్లి : తునికి పండ్లు తెంపడానికి యత్నించిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం బజ్జుతండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బజ్జుతండాకు చెందిన జరుపుల వాల్యా, అంబాలి దంపతుల కుమారుడు వెంకటేష్‌(28) గురువారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ బావివద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రి వాల్యా బావి గట్టున ఉన్న తునికి చెట్టు పండ్లు తెంపి కుమారుడికి ఇచ్చాడు. తండ్రి వెళ్లిన తర్వాత మరికొన్ని పండ్లు తెంపేందుకు వెంకటేష్‌ యత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. ఈ ప్రమాదం మధ్యాహ్నం జరగగా సాయంత్రం వరకు ఎవరూ గమనించలేదు. బావి గట్టుపై వెంకటేష్‌ చెప్పులు ఉండడాన్ని చూసిన స్థానికులు.. వెంటనే తల్లిదండ్రులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. మోటార్ల సాయంతో బావిలోని నీటిని తోడగా వెంకటేష్‌ మృతదేహం లభ్యమైంది. అప్పటి వరకు తమ కళ్లెదుటే తిరిగిన కుమారుడు విగతజీవిగా బయటకు రావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

● ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి నివాసం ముట్టడి

బావిలో పడి యువకుడి మృతి

బజ్జుతండాలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement