నీలినీడలు.. | - | Sakshi
Sakshi News home page

నీలినీడలు..

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

నెహ్రూసెంటర్‌: జిల్లా మత్స్యకారులకు ఎల్‌నినో శాపంగా మారింది. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గింది. దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అధికారుల నుంచి ఆదేశాలు లేకపోవడంతో చేప పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నా యి. జిల్లాలో 1,240 చెరువు ఉన్నాయి. కాగా, సరిపడా నీటిమట్టం ఉన్న చెరువుల్లో చేప పిల్లలను పోయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

తప్పని ఎదురుచూపులు..

ప్రతీ ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో వారు నిరాశకు గురవుతున్నారు. చేప పిల్లలకు బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలని కోరుతున్నారు.

చెరువుల నీటిమట్టంపై అధికారుల అంచనా..

తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చెరువుల్లో సరిపడా నీరు లేదు. దీంతో చేప పిల్లలను వదిలేందుకు సరిపడా నీటి మట్టం ఉన్న చెరువులను గుర్తించేందుకు ఇరిగేషన్‌ శాఖ కసరత్తు చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చే సంఖ్య ఆధారంగా ఎన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలేది తెలుస్తుంది.

చేప పిల్లల పంపిణీ ఆలస్యం చేయొద్దు

ఉచిత చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైంది. వర్షాలు సమృద్ధిగా పడకపోవడంతో కొన్ని చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోయింది. అధికారులు నీటిమట్టం ఉన్న చెరువులను గుర్తించి, వాటిలో చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలి.

– కొత్తూరు రమేశ్‌, జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల చీఫ్‌ ప్రమోటర్‌

ఎల్‌నినో ప్రభావంతో చెరువుల్లో తగ్గిన నీటిమట్టం

ఉచిత చేప పిల్లల పంపిణీపై సందిగ్ధం

ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement