● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: విద్యారంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ కొనియాడారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యా వైతాళికుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఆజాద్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. ఆధునిక విద్యా విధానాలు, విద్యా ప్రణాళికల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా నూతన విద్యా విధానానికి పునాదులు వేశారన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని చదువుకు ప్రాధాన్యం ఇస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్వో నాగలక్ష్మి, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలి
అర్హత కలిగిన మిల్లర్లు అగ్రిమెంట్, బ్యాంకు గ్యారంటీలను వెంటనే సమర్పించాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంఆర్ రోజువారి లక్ష్యాలకు అనుగుణంగా డెలివరీ చేయాలన్నారు. సమావేశంలో డీసీఎస్‌ఓ రమేశ్, సివిల్ సప్లయీస్ ఇన్‌చార్జ్ మేనేజర్ మనోజ్, సంబంఽధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


