రాష్ట్రంలో కేఎంసీని అగ్రస్థానంలో నిలపాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కేఎంసీని అగ్రస్థానంలో నిలపాలి

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

కాశిబుగ్గ: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపు తూ పేరు తీసుకురావాలని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రమేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కేఎంసీలో ‘ఉత్కర్ష’– 2026 వేడుకలు (వార్షిక కళాశాల వేడుకలు) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాకతీయ మెడికల్‌ కళాశాలకు నాటి నుంచి గొప్ప పేరు ఉందని, ప్రస్తుతం హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను పెద్ద నగరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుతూ ఈ కళాశాల పేరు నిలపాలని సూచించారు. ఈ సందర్భంగా కేఎంసీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బిజీ షెడ్యూల్‌ నుంచి కొంత ఉపశమనం కోసం ఉత్కర్ష వేడుకలు ఏడు రోజుల పాటు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌ దివ్వెల మోహన్‌దాస్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ రాంకుమార్‌రెడ్డి, పలువురు వైద్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఉత్కర్ష–2026 లోగోను వీసీ రమేశ్‌రెడ్డి ఆవిష్కరించారు.

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి

కృషి చేయాలి

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత అన్నారు. బుధవారం కాకతీయ వైద్య కళాశాల ఉత్కర్ష–2026 భాగంగా ‘నశా ముక్త్‌ భార త్‌ అభియాన్‌’పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కళాశాల విద్యార్థులు హెల్త్‌ రన్‌, ప్లాష్‌మాబ్‌ నిర్వహించారు. కేఎంసీ నుంచి హనుమకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ వరకు నిర్వహించిన కార్యక్రమలో సీపీ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో గుర్తింపు పొందిన విద్యాసంస్థ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా యువతకు చేరవేయడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు..

కేఎంసీ నుంచి పోలీసు హెడ్‌క్వార్టర్‌ వరకు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైద్య కళాశాల విద్యార్థులు నాటక, నృత్య ప్రదర్శనల ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలను వివరించారు. ఇవి ఆకట్టుకున్నాయి. అనంతరం పోలీసు హెడ్‌క్వార్టర్‌ గ్రౌండ్‌లో ‘సే నో టు డ్రగ్స్‌’ అనే నినాదంతో మానవహారం ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ ఏసీపీ నరసింహారావు, సీఐలు నడిపల్లి కరుణాకర్‌, మచ్చ శివకుమార్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ సాయి రమణ, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డి.మోహన్‌దాస్‌, ప్రవీణ్‌, హెల్త్‌రన్‌ కో ఆర్డినేటర్లు షణ్ముఖ్‌, వసంత్‌, కేఎంసీ, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వీసీ రమేశ్‌ రెడ్డి

‘ఉత్కర్ష’ –2026 వేడుకలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement