భగిని హస్త భోజనం.. ఆప్యాయతల విందు | - | Sakshi
Sakshi News home page

భగిని హస్త భోజనం.. ఆప్యాయతల విందు

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

● అన్నాచెల్లెళ్ల అనుబంధానికి

ప్రతీకగా పండుగ

జనగామ : భగిని హస్త భోజనం.. భారతీయ సంస్కృతిలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక. సోదరుల క్షేమం, ఆయురారో గ్యాలను కాంక్షిస్తూ అక్కాచెల్లెళ్లు తమ ఇళ్లకు ఆ హ్వానించి స్వయంగా భోజనం పెట్టడం ఈ పండుగ ప్రత్యేకత. ఇది కేవలం భోజన కార్యక్రమం మాత్రమే కా దు, కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఆత్మీయ వేడుక. కాలక్రమంలో కు టుంబ సభ్యులు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవసరాలతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ ఈ ఆచారం ద్వారా ఒకచోట చేరుతున్నారు. అక్కాచెల్లెళ్ల ఆశీర్వచనాలు తీసుకుంటూ అన్నదమ్ములు వారి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కుటుంబ వ్యవస్థలోని అనుబంధాలు, భారతీయ సంస్కృతి గొప్పదనానికి అద్దం పడుతోంది. కాగా, జనగామ జిల్లా వ్యాప్తంగా బుధవారం భగిని హస్త భోజన కార్యక్రమాన్ని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తాము స్వయంగా వివిధ రకాల పిండి వంటలు, తీపి పదార్థాలు, ఇతర వంటలు తయారు చేసి సోదరులకు ప్రేమగా వడ్డించి తమ అభిమానం చాటుకున్నారు.

క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలి

ఖిలా వరంగల్‌ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని వరంగల్‌ రవాణాశాఖ అ ఽధికారి(డీటీఓ) రంగారావు సూచించారు. బుధవారం వరంగల్‌ రవాణాశాఖ కార్యాలయ ప్రాంగణంలో సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) శోభన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పీఎం–రహత్‌, పీఎం–రహవీర్‌ పథకాలపై వాహనదారులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీటీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం–రహత్‌, పీఎం– రహవీర్‌ పథకాల ప్రధాన లక్ష్యమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలి నుంచి హాస్పిటల్‌కు తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు. క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఏఎంవీఐ ఉదయ్‌కుమార్‌, ఎన్‌ఐఎస్‌యూ నుంచి మహేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కాజీపేట, వరంగల్‌

మీదుగా ప్రత్యేక రైళ్లు

కాజీపేట రూరల్‌: ప్రయాణికుల సౌకర్యార్థం కాజీ పేట, వరంగల్‌ రైల్వే స్టేషన్ల మీదుగా గయా–ఎంజీ ఆర్‌ చైన్నె సెంట్రల్‌, ఎస్‌ఎంవీటీ బెంగళూరు–బ రౌని మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మ ధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ బుధవారం తెలిపారు.

కాజీపేట మీదుగా ..

ఈ నెల 9నుంచి 30వ తేదీ వరకు ప్రతీ సోమవారం బయలుదేరే ఎస్‌ఎంవీటీ బెంగళూరు–బరౌని (06587) 4 ఎక్స్‌ప్రెస్‌లు మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ నెల 12 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ వరకు ప్రతీ మంగళవారం బరౌని–బెంగళూరు కాంట్‌ (06588) 4 ఎక్స్‌ప్రెస్‌లు మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు సికింద్రాబాద్‌, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

వరంగల్‌ మీదుగా..

ఈ నెల 17న బయలుదేరే గయా–ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌ (03689) ఎక్స్‌ప్రెస్‌ మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు బల్లార్షా, వరంగల్‌, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement