పాలకుర్తి నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు | - | Sakshi
Sakshi News home page

పాలకుర్తి నా ప్రాణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

● మాజీ మంత్రి దయాకర్‌రావు

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి నియోజకవర్గంతో తన అనుబంధం విడదీయలేనిదని, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న సొంతింటి నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పాలకుర్తి తనకు కేవలం రాజకీయ వేదిక మాత్ర మే కాదని, ప్రాణంతో సమానమన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తాన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షులు పసునూరి నవీన్‌, వినయ్‌రావు, అశోక్‌రెడ్డి, నల్ల నాగిరెడ్డి, పాము శ్రీనివాస్‌, మహేందర్‌నాయక్‌, మామిండ్ల శోభన్‌బాబు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక..

బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఐలేని సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో మండలంలో ని శాతాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు రావుల నర్స య్య, రమేశ్‌, మహేశ్‌, గన్న అజయ్‌రెడ్డి, లాకావత్‌ బుచ్చమ్మ, గన్న నర్సి రెడ్డి కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement