మహబూబాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 11 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

ఈనెల 21, 22, 23వ తేదీల్లో ఇన్‌స్పైర్‌ పోటీలు

● ఎంపికై న ఒక్కో విద్యార్థి అకౌంట్‌లో రూ.10వేలు జమ

● పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, సైన్స్‌ టీచర్లు వాడుకున్నట్లు ఆరోపణలు

● ఎగ్జిబిట్స్‌ తయారీలో టీచర్స్‌, విద్యార్థుల నిమగ్నం

సాక్షి, మహబూబాబాద్‌: విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సాహకం అందిస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తారు. ఈమేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఎగ్జిబిట్స్‌ ప్రదర్శించనున్నారు. కాగా, జిల్లాలో ఎంపికై న ఒక్కో విద్యార్థి ఖాతాల్లో రూ.10వేలు జమ చేశారు. అయితే ఈ నిధులను పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, సైన్స్‌ టీచర్లు వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పలువులు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎగ్జిబిట్స్‌ తయారీలో నిమగ్నమై ఉంటే.. మరికొందరు అదేరోజు మొక్కుబడిగా ఎగ్జిబిట్స్‌ తయారు చేసి తెచ్చే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి.

72 ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలకు ఎంపిక చేశారు. జిల్లాలోని 72 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేశారు. అయితే ఇందులో కొందరు విద్యార్థులు పాఠశాల సైన్స్‌ టీచర్ల సమక్షంలో డబ్బులను డ్రా చేసి కావాల్సిన వస్తువులు, రసాయనాలు, విద్యుత్‌ పరికరాలను కొనుగోలు చేసి ఎగ్జిబిట్స్‌ తయారు చేసే పనిలో ఉన్నారు. మరికొందరు విద్యార్థుల ఖాతాల్లోని డబ్బులు వారి తల్లిదండ్రులు డ్రాచేసినట్లు తెలిసింది. ఇంకొందరి విద్యార్థుల ఖాతాల్లో పడిన డబ్బులను సైన్స్‌ టీచర్లు తీసుకొని వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎగ్జిబిట్లను తయారు చేసి ప్రదర్శిస్తారో తెలియని పరిస్థితి ఉంది.

మూడు ప్రదర్శనలు ఒకేచోట..

ప్రతీ సంవత్సరం ఇన్‌స్పైర్‌, జిల్లా సైన్స్‌ఫెయిర్‌, పీఎం శ్రీ పాఠశాలల సైన్స్‌ఫెయిర్‌ వేరువేరుగా నిర్వహిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఒకేసారి మూడు ప్రదర్శనల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఏడు రకాల థీమ్స్‌తో సైన్స్‌ఫెయిర్‌ ప్రదర్శనలు తయారు చేయాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా మెరుగైన జీవితం కోసం ఏఐ, పర్యావరణ పరిరక్షణ, గణిత నమూనాల రూపకల్పన, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వదేశీ వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విజ్ఞానం, విపత్తుల నివారణ మార్గాలపై ప్రదర్శనలు ఉండాలి. అలాగే ఇన్‌స్పైర్‌లో ప్రజల మెరుగైన జీవనం, సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనలపై ఎగ్జిబిట్స్‌ తయారు చేయాలి. పీఎం శ్రీ పోటీల్లో కూడా శాస్త్ర విజ్ఞానం ప్రజల అవసరాలు, జీవనం మెరుగు పడేందుకు దోహదపడాలి. అయితే వీటన్నింటిని ఒకేచోట ప్రదర్శిస్తే అంతా గందరగోళంగా ఉంటుందని, న్యాయ నిర్ణేతలు కూడా ఎంపికలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యార్థుల్లో ప్రతిభను

వెలికితీయాలి

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్‌ఫెయిర్‌, ఇన్‌స్పైర్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు మంచి ఎగ్జిబిట్స్‌ ఎంపిక చేసి విద్యార్థులతో చేయించాలి. వారిలోని ప్రతిభకు పదును పెట్టాలి. ఇన్‌స్పైర్‌ డబ్బులను సద్వినియోగం చేయాలి. మొక్కుబడి ప్రదర్శలు తెస్తే ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

– అనిల్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌(ఇన్‌చార్జ్‌ డీఈఓ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement