గార్ల: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాంనాయక్ అన్నారు. మంగళవారం గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల క్రీడామైదానంలో ఏటూరునాగారం ఐటీడీఏ కొత్తగూడ డివిజనల్స్థాయి ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల క్రీడా పోటీలను సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాంతో కలిసి ఆయన ప్రారంభించారు. క్రీడాపోటీల్లో గంగారం, బయ్యారం, కొత్తగూడ, గూడూరు, గార్ల మండలాల్లోని 12 ఆశ్రమ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు అండర్–14 నుంచి అండర్–17వరకు బాలబాలికలకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామని దేశీరాంనాయక్ వెల్ల డించారు. విద్యార్థులకు స్థానిక ఆశ్రమ పాఠశాలలో భోజన వసతి కల్పించారు. తొలుత విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ, పీడీ ఈసం పద్మ, తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఎంఈఓ వీరభద్రం, ఎస్సై సాయికుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణగౌడ్, మాజీ సర్పంచ్ గంగావత్ లక్ష్మ ణ్నాయక్, జీసీడీఓ విజయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోకాళ్ల రామచంద్రు, ఈరూనాయక్, ఉపాధ్యాయులు రాధిక, హనుమంతు, హనుమ, మేఘ్యా, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాంనాయక్


