వరి వద్దు.. కూరగాయల సాగు మేలు | - | Sakshi
Sakshi News home page

వరి వద్దు.. కూరగాయల సాగు మేలు

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

● కలెక్టర్‌ స్నేహశబరీష్‌

గూడూరు: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి పంట సాగు చేయవద్దని, ఆరుతడి, కూరగాయల పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. మండలంలోని భూపతిపేట రైతు వేదికలో మంగళవారం ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్‌ సరఫరాతో ఎంత ఖర్చు అవుతుందో వివరించారు. వీబీజీ రాంజీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతీ రైతు భూగర్భజలాలను ఆదా చేసేందుకు పొలాలలో ఫాంపాండ్‌ కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ఉపయోగంపై సర్పంచ్‌లు, కార్యదర్శులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ నీటి అవసరం ఉండే కూరగాయల సాగు చేయాలని, దీంతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వెంగంపేట జీపీలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల సాగు పంటలను పరిశీలించారు. అక్కడ నుంచి భీమునిపాద జలపాతం అభివృద్ధిపై రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు ద్వారా ఇక్కడ పనిచేస్తున్న కమిటీ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో చేయూత పింఛన్‌ దరఖాస్తుల వెరిఫికేషన్‌ ప్రక్రియ ను పరిశీలించి అసంతృప్తి చెందారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి మరియన్న, ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ నాగభవాని, ఎంపీడీఓ టీవీఎల్‌ఎన్‌ శాస్త్రి, ఏఓ అబ్దుల్‌మాలిక్‌, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అర్హులందరికీ చేయూత పింఛన్లు..

మరిపెడ: అర్హులందరికీ చేయూత పింఛన్లు అంది స్తామని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న చేయూత పింఛన్‌ దరఖాస్తుల వెరిఫికేషన్‌ ప్రక్రియను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులకు పింఛన్‌ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యవేక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ సునీతరవీందర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement