● మార్కెట్ షెడ్లలోకి గాలి, వెలుతురు రాక రైతుల ఇబ్బందులు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ షెడ్లలో మార్క్‌ఫెడ్ మక్కలను పూర్తిస్థాయిలో ఎగుమతి చేసినప్పటికీ, వాటి భద్రత కోసం చుట్టూరా ఏర్పా టు చేసిన రేకులను మాత్రం తొలగించలేదు. దీంతో రైతులతో పాటు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది యాసంగిలో రైతులు పండించిన మక్కలను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. సేకరించిన మక్కల బస్తాలను మార్కెట్ షెడ్‌లలో నిల్వ చేశారు. ఈక్రమంలో మక్కల భద్రత కోసం షెడ్‌ల చుట్టూరా ఇనుప రేకులను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మక్కల బస్తాలను ఎగుమతి చేయడంతో షెడ్లు ఖాళీ అయ్యాయి. దీంతో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను మార్కెట్‌కు అమ్ముకునేందుకు తీసుకువచ్చి, షెడ్లలో రాశులుగా పోసుకుంటున్నారు. అయితే షెడ్లకు చుట్టూరా రేకులు ఉండడంతో గాలి, వెలుతురు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకులను తమ మిల్లులకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా రేకులను తొలగించాలని కోరుతున్నారు.


