మైనర్లు.. బైక్‌లపై చక్కర్లు! | - | Sakshi
Sakshi News home page

మైనర్లు.. బైక్‌లపై చక్కర్లు!

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

జిల్లాలో మూడేళ్లలో

నమోదైన కేసులు

180

77

జిల్లాలో పెరుగుతున్న ప్రమాదాలు

● మూడేళ్లలో 335 కేసుల నమోదు

2024 2025

2026 (అక్టోబర్‌)

78

తొర్రూరు: చిన్న వయసులోనే బైక్‌లు నడపాలన్న సరదా.. కొందరు తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల మైనర్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరంగా మారి ఎదుటి వారిని కష్టాల్లో పడేస్తోంది. జిల్లాలో మైనర్ల డ్రైవింగ్‌ రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, అవగాహన లేమి, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. తీరు మారడం లేదు. జిల్లా వ్యాప్తంగా మైనర్‌ డ్రైవింగ్‌తో కలిగే అనర్థాలపై పోలీస్‌ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 77 కేసులు నమోదు కాగా, రూ.37,500 జరిమానా విధించారు.

ప్రాణాలు పోతున్నా..

పిల్లల భద్రతపై దృష్టి పెట్టాల్సిన తల్లిదండ్రులు వారి చేతికి బండ్లు ఇవ్వడంతో రహదారులపై ఇష్టారీతిన వెళ్తున్నారు. పోలీసు తనిఖీల్లో అక్కడక్కడా పట్టుబడుతుండగా, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న మైనర్లు ఎందరో ఉన్నారు. సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదాలను గ్రహించలేకపోతున్నారు. కనీస వయసు, పరిణతి లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్ల సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. వీరి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తమతో పాటు ఇతరులకు నష్టం కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉంటున్నాయి.

పోలీస్‌ శాఖ కఠిన చర్యలు...

జిల్లాలో మైనర్‌ డ్రైవింగ్‌పై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. పోలీసు తనిఖీల్లో పట్టుబడిని వారితో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా.. పదే పదే రహదారులపైకి వస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాహన యజమానులు, వారి తల్లిదండ్రులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

మైనర్లకు వాహనాలు

ఇవ్వడం నేరం

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై ఎలాంటి అవగాహన లేని పిల్లలు వాహనాలను తీసుకుని రోడ్డెక్కితే చాలా నష్టం జరుగుతుంది. ఆ పిల్లల కుటుంబాలే కాకుండా సమాజం కూడా ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు.

– కృష్ణకిశోర్‌, తొర్రూరు డీఎస్పీ

చట్ట ప్రకారం శిక్షార్హులు..

మైనర్‌ వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే వాహన యజమానికి లేదా బాలుడి సంరక్షకుడిపై కేసు నమోదు చేస్తారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. ప్రమాదానికి కారణమైన వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేయవచ్చు. 18 ఏళ్లు నిండని వారు రోడ్డు ప్రమాదాలకు కారణమైతే 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్‌ మంజూరు చేయొద్దని చట్టం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement