వీరన్న సన్నిధిలో ఆకాశదీప పూజలు | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో ఆకాశదీప పూజలు

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

కురవి: కార్తీకమాసం ప్రారంభోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని భద్రకాళీ సమే త వీరభద్రస్వామి ఆలయంలో ఆకాశదీప పూ జలను మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజలు జరిగాయి. పూజలో ఆలయ చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి, ఈఓ సత్యనారా యణ పాల్గొన్నారు. మహిళా భక్తులు అధికంగా పూజల్లో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. పూజల అనంతరం ఈఓ సత్యనారా యణ ధ్వజస్తంభంపైకి దీపాన్ని లాగారు. ధ్వజస్తంభంపై అఖండదీపం భక్తులకు దర్శనమిచ్చింది. తొలుత ఆలయంలో వీరభద్రస్వామికి సంపూర్ణాభిషేక పూజలు చేశారు.

బాపట్ల బీచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక యాత్ర బస్సు

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 14న (శనివారం) ఉదయం 4గంటలకు బాపట్ల బీచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక యాత్ర డీలక్స్‌ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ వి.కల్యాణి మంగళవారం తెలిపారు. బాపట్ల నుంచి తిరిగి అదేరోజు రాత్రి 11 గంటలకు బస్సు డిపోకు చేరుకుంటుందన్నారు. యాత్రలో భాగంగా పెద్దలకు రూ. 1000, పిల్లలకు రూ.500 చార్జీలుగా నిర్ణయించినట్లు తెలిపారు. బుకింగ్స్‌ కోసం 99592 26054, 91216 04919, 99482 14022 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

పాకాల నుంచి ఎత్తిపోతలకు అధికారుల సర్వే

కొత్తగూడ: పాకాల సరస్సు నుంచి మండల పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. పాకాల సరస్సు నుంచి మండలంలోని పంటలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ఇటీవల అధికారులకు సూచించారు. ఈమేరకు ఐబీ ఎస్‌ఈ స్వామి, ఈఈ నారాయణ, డీఈఈ రాజు నీటిని తరలించేందుకు అనువైన స్థలాలు, మండలంలోని చెరువుల సామర్ధ్యం పరిశీలించి నీటి అవసరాన్ని గుర్తించారు. అందుకు కావాల్సిన నిధుల అవసరాన్ని సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఎస్‌ఈ స్వామి తెలిపారు. వారి వెంట కొత్తగూడ సర్పంచ్‌ మల్లెల భాగ్యమ్మ, స్థానిక రైతులు ఉన్నారు.

యువత దేశానికి వెన్నెముక

మహబూబాబాద్‌ అర్బన్‌: యువత దేశానికి వెన్నెముక అని, మాదకద్రవ్యాలకు అలవాటుపడొద్దని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ‘నషాముక్త్‌’ కార్యక్రమంలో భాగంగా యువజన వేడుకలు నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జ్యోతి, డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ బిందుమాధురి హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా అధికారి జ్యోతి మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు చెడు వ్యసనాల కు దూరంగా ఉన్నప్పుడే తమ లక్ష్యాలు సాధి స్తారన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలు పొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. నేషనల్‌ యూత్‌ అవార్డు గ్రహీత ఆకులపల్లి మధు, యువభారత్‌ సూపరింటెండెంట్‌ దేవీలాల్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ యాదలక్ష్మి, సీనియర్‌ అధ్యాపకుడు శేషు, అడ్వకేట్‌ మహేందర్‌రెడ్డి, మేరా యువభారత్‌ జల్లా యువజన అధికారి సంజీవ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement