కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలి

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏడు మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందని, మానుకోట మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు మంగళవారం మానుకోటను కరువు జిల్లాగా ప్రకటించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) పనులు కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నారు. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు అజయ్‌సారథి, నల్లు సుధాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement