వైభవంగా దీపావళి ‘బతుకమ్మ’ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా దీపావళి ‘బతుకమ్మ’

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

హసన్‌పర్తి : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలో మూడు రోజుల పాటు సాగిన దీపావళి బతుకమ్మ వేడుకలు మంగళవారం భక్తి శ్రద్ధలతో ముగిశాయి. నేతకాని కులస్తులకే ఈ వేడుకలు ప్రత్యేకం. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి సా యంత్రం మహిళలు, పురుషులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గ్రామం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన బతుకమ్మల భారీ ప్రదర్శన సాయంత్రం 7 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా యువకులు కోలాటాలు చేస్తూ ముందుకు సాగారు. మళ్లీ రావమ్మ గౌరమ్మ అంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ బతుకమ్మలతో మహిళలు ముందుకు సాగారు. అనంతరం స్థానిక చెరువు వద్ద బతుకమ్మ ఆడి అనంతరం నిమజ్జనం చేశారు.

హాజరైన ఎమ్మెల్యే,

డీసీసీ అధ్యక్షులు, మాజీఎమ్మెల్యేలు

కాగా, ఈవేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరు రమేశ్‌, డీసీ సీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మహ్మద్‌ అయూబ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బతుకమ్మలను ఎత్తుకుని మహిళలను అనుసరించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సర్పంచ్‌ మేక రమ్య, మాజీ సర్పంచ్‌ శరత్‌, మాజీ ఎంపీటీసీ సభ్యులు రజిత, గిన్నారపు సుగుణ, పీఏసీఎస్‌ మాజీచైర్మన్‌ తోకల లక్ష్మారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కిరణ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

సీతంపేటలో బతుకమ్మలతో

భారీ ప్రదర్శన

ముగిసిన ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement