బచ్చన్నపేట: తెలంగాణ తల్లి స్ఫూర్తితో రాష్ట్ర సాధనలో ప్రజలు, ఉద్యమకారుల నిర్వహించిన పోరాటాలు చిరస్మరణీయమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈమేరకు మంగళవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి, రైతులు, యువత, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పెద్దవాగుపై కోట్లాది రూపాయలతో చెక్ డ్యామ్‌లు నిర్మించి పంటలకు వేసవిలోనూ గోదావరి జలాలు అందించామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏనాడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించలేదని, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు


